తొలిసారి….

tolisaari

Posted by: ssreddyr on: జులై 1, 2007

నేను ఇంటర్ మొదటి సవంత్సరము చదువుతున్నప్పుడు వ్రాసినది.

అది పదహారెళ్లప్రాయం, ఊహల్లొ పయనించే ప్రాయం
ఈ ప్రాయం లో అనిపిస్తుంది చదువు అంటే బోరు,
ఈ ప్రాయం లో కనిపించేది మాత్రం సినిమా ల జోరు,
ఎప్పుడు ఆనందముగ ఉండాలనే మనోభావాలు,
తమను మించిన వారు ఉండరాదని కోరుకొనె చిరుహృదయాలు,
చెదు మార్గాలకు సులభంగా లొంగే విద్యార్థులు,
మంచి మార్గం లొ పయనించాలనే తపన తో నిరాశ చెందే లెతమనసులు,
అపజయం నుండి తేరుకొలేక నిరశతో బ్రతికే హృదయాలు,
సుఖ దుఃఖా లను సమపళ్లలొ చుడలేని మనసులు,
మిడి మిడి జ్ఞానంతో మిడిసిపడి జీవితంలో అదుగు పెట్టే విద్యార్థులు
ఏం చెస్తాం,
చదువును అలక్షం  చెసే ప్రాయం,
అది పదహారెళ్లప్రాయం, ఊహల్లొ పయనించే ప్రాయం …..!

ప్రత్యుత్తరమిమ్ము