తొలిసారి….

నేను – బెంగుళూరు

Posted by: ssreddyr on: జులై 6, 2007

అందరికి నమస్కారం, నా అనుభవాలను కొన్నిటిని మీ ముందు ఉంచాలని నా ప్రయత్నము . ఇది నా తొలి ప్రయత్నము … తప్పులు వుంటె తెలియచెయగలరు … అని ఆశిస్తు …. *******************************************************************

ఇది నాలుగు సంవత్సరాల క్రిందటి మాట…..

నేను యం.సి.ఎ కోర్సు పూర్తి చేసి ఉద్యొగం కోసం నేను బెంగుళురు వచ్చాను. నా మిత్రులు అంతా హైదరాబాదు కు వెళ్ళారు.నాకు వరసకు మామయ్యా అయ్యే ఆయన ఇక్కడ బెంగుళురు లొ ఉండటము తొ నెను బెంగుళురు వచ్చాను.

మ మామయ్యా ఫ్రెండ్స్ కూడా సాఫ్ట్ వేర్ జాబ్స్ కు ట్రై చెస్తువుండటం  తో వాళ్ళ ఫ్రెండ్స్ రూములొ నన్ను వదిళారు.

మ మామయ్యా ఫ్రెండ్స్ , మ మామయ్యా  మాట కాదు అనలేక, ఇష్టము లేకపొయినా నన్ను అక్కడ వుండమన్నారు.రూము మాత్రం చాల చిన్నది రాత్రి ఒక వైపు కు పడుకొంటె రెండవైపు కు తిరిగె అవకాశము లెదు. మా మామయ్యా ఫ్రెండ్స్ ఎవరు నాకు తెలెయదు ఆయె. వాళ్ళ కు నేను కొత్త, భోజనం కోసము మాత్రం నన్ను పిలెచే వారు అలా రెండు రోజులు జైలు లొ  లాగ గడచిపొయింది…

మూడవ రోజు  ఇంక లాభాం  లేదు నేను ఎలాగొల వాళ్ళ తొ కలసిపొవలని అనుకున్న. కాని ఎలా… అని ఆలొచిస్తున్న నాకు ఒక ఐడియ  వచ్చింది. నాకు తెలిసిన కుల్లు జొకులను చె ప్పి వారితొ మెల్లిగ పరిచయము పెంచుకోవలని అనుకున్నాను …

ఒక  అతను ఒంటరిగా ఉండెది చూసి ..వెళ్ళి అన్న నిన్ను  ఒక ప్రశ్న అడగన అన్నాను , ఆయన నా వైపు ఎగ దిగ ఒక చుపు చూసి ..అఇష్టంగానే సరె చెప్పు అన్నాడు. ఇక నేను మొదలెట్టా
  
        ఒక ఏనుగు , చీమ రెండు బైక్ లో వెళుతున్నవి చీమ బైక్ ను నడుపుతూ వుంది, ఇంతలొ బైక్ వెళ్ళి ఒక కొండకు ఢీ కొట్టింది. ఏనుగు తలకు బాగ దెబ్బలు తగిలాయి …కాని ముందు కూర్చొన్న చీమ తలకు ఏటువంటి గాయము తగలలెదు ఎందుకు ? అని అడిగాను

   అతను కొద్దిసేపు ఆలోచించి చీమ బరువు తక్కువా … కాబట్టి ద్రవ్యరాసి తక్కువ , ద్రవ్యరాసి తక్కువగా వున్న వస్తువు దేనికైన ఢీ కొంటే తక్కువ బలము ప్రయొగించబడును (ఇంకా ఎదొదో చెప్పడు నాకు గుర్తు లేదు) అని చెప్పి ఇది కరెక్టా అని అడిగాడు తన భౌతిక శాస్రా పరిజ్ఙానికి మురిసిపోతు…… నేను కాదు చీమ హెల్మెట్ పెట్టుకునందు వల్ల చీమ తలకు దెబ్బ తగలలెదు అని చెప్పాను …
 
     నాదెగ్గర జొకులు వద్దు ? అని …నా వైపు కొపంగా చూసి వెల్లిపొయడు…
    
     కాని అప్పుడు అలా వెళ్ళినా  ఆరోజు రాత్రి జరిగిన విషము అందరికి చెప్పి నవ్వుకున్నాడు అప్పటి నుండి రూములొ అందరూ అతన్ని ప్రొఫెసర్ అని అట పట్టించటము జరెగేది ….

     ఆ తరువాతా రూములొ అందరు నాకు మంచి ఫ్రెండ్స్ అయ్యారు.

     ఇలా బెంగుళూలొ నా ప్రస్తానము మొదలు అయ్యింది …
 

1 స్పందన కు "నేను – బెంగుళూరు"

మీ బెంగుళూరు ప్రస్తానం బాగా మొదలుపెట్టారు.తదుపరి భాగం కొరకు ఎదురుచూస్తుంటామని మఱువరుగా! తరచుగా post చేస్తూండండి.

ప్రత్యుత్తరమిమ్ము