Posted by: ssreddyr on: జులై 7, 2007
ఇక ప్రాజెక్ట్ కొసం వేట మెదలు అయ్యింది….
కొన్ని కంపనీ లు ప్రాజెక్ట్ ఇస్తాము అన్నారు డబ్బు కడితె … నా దగ్గర అంత డబ్బు లెదాయె …
డబ్బు అడక్కుండ ప్రాజెక్ట్ ఇచ్చే కంపనీ దొరక్కపొతుందా అని పట్టు వదలని విక్రమార్కుని ల ప్రయత్నిస్తూనే ఉన్నాను
అలా రోజు మాదిరిగ ఓ రోజు ఒక చిన్న కంపని కి వెళ్లి ( పేరు గుర్తు లేదు) వచ్చి రాని ఇంగ్లిష్ లొ (నాకు ఇంగ్లిష్ అంటె చచ్చెంత భయం ) రెషెప్సనిస్ట్ ని ప్రాజెక్ట్ అడిగను. ఆమె నన్ను ఆ కంపనీ మేనేజర్ దగ్గరకు పంపింది . మనసులొ నాకు ప్రాజెక్ట్ దొరికిపొయినంత ఆనందం కలిగింది . ఎందుకంటె అన్ని కంపనిలు రెసుమి తీసుకొని తరువాత కాల్ చెస్తాము అని చెప్పెవారు , ఇక్కడేమొ డైరెక్ట్ గా మేనేజర్ దగ్గరకు పొమ్మనుటున్నరు చూస్తె చాల రెక్వరెమెంట్ ఉన్నట్టుంది.
మేనేజర్ దగ్గరకు వెళ్ళను, ఆయనకు నాకు మధ్య సంభాశన ఇలా జరిగింది ..
మేనేజర్ : what is your name?
నేను :shankar reddy sir i am studing mca final semistar ..looking for project.. ( ఈ నాలుగు ముక్కలు ఇంగ్లిష్ లొ బట్టీ పట్టి వెళ్ళను )
మేనేజర్ : Well mr.reDDy here we have just started our branch. we do development in our main branch,it is not here ..here we dont have any projects also .
నేను : No problem sir, give main branch address, i go there అన్న వచ్హి రని ఇంగ్లిషులొ
మేనేజర్ : Great ..For project work if you want to go that far ..i will give the address అని ఒక పెపరు లొ వ్రాసి ఇచ్చారు.
అక్కడ నుండి గర్వంగా బయటకు వచ్చాను.
వెంటనె హైదరాబాదు లో డబ్బు కట్టి ప్రాజెక్ట్ వర్క్ చేస్తున్న సత్యం గానికి, రుపెష్ గానికి నాకు ప్రాజెక్ట్ అల్మొస్ట్ వచ్చినట్లె అని ఫొన్ చేసి చెప్పా గర్వంగా . అలాగే ఏ ప్రాజెక్ట్ లేని శెషు గానికి తులసి గానికి ఫొన్ చేసి వాళ్ళ కు కూడ ప్రాజెక్ట్ నేను ఇప్పిస్తానని హామి ఇచ్చాను. ఇంక తులసి గాడు ఐతే రాత్రికే బస్ ఎక్కెస్తానన్నాడు . ఆ రొజుకు వాన్ని రాకుండ ఆపెసరికి నా తల ప్రణాం తొకకు వచ్చింది
ఆప్పుడె కొత్త అడ్రస్ తీసుకొని ఆ కంపని దగ్గరకు వెళ్ళాలని అడ్రస్ ఇద్దరు ముగ్గురు దారిన పొయె వాళ్ళని అడిగాను , తెలిదు అని కొందరు , మరి కొందరు నా వైపు కొపంగ చూస్తు వెళ్ళారు , నాకైతె ఏమి అర్థం కాలె ….
రూంలొ ఫ్రెండ్స్ ని అడిగి తరువాతి రొజు పొదాం లే అనుకుని … రూంకి స్వీట్స్ తీసుకొని వెళ్ళాను
రూంలొ అందరికి అల్మొస్ట్ ప్రాజెక్ట్ వచ్చినట్లె అని చెప్పి స్వీట్స్ ఇచ్చాను, వాల్లంత ప్రాజెక్ట్ ఎక్కడ అని అడిగారు , ఇక్కడే బెంగళరు లొ కాని అడ్రస్ నాకు తెలిదు, ఎవరిని అడిగిన విచిత్రంగా చుస్తున్నారు మిరైన ఎక్కడొ చెప్పండంటు వాళ్ళకు అడ్రస్ చుపించాను . వాళ్ళు ఆ అడ్రస్ చూసి ఒకటే నవ్వు …నాకైతె ఏమి అర్థం కాలేదు
తరువాత వాళ్ళు నవ్వు ఆపి చెప్పెంత వరకు తెలిదు అడ్రస్ లొ వున్నది “నొయ్ డ” అని అది బెంగళరు లొ లేదని , డిల్లి దగ్గర వుందని ..(నిజంగ నేను “నొయ్ డ” పేరు ని అంత వరకు విని ఎరుగను ) అప్పుడు చూడలి కొద్ది రొజులపటు నా అవస్థ ఓ వైపు శెషు,తులసి దగ్గిర నుండి ఫొన్ ల మిద ఫొన్ లు రూంలొ వాళ్ళు నన్ను ఆటపట్టించటము …..
(ఇప్పటికి నా ఫ్రెండ్స్ ఏ విషయము గుర్తు చెస్తూ నన్ను ఆటపట్టిస్తుంటారు …..)
జులై 7, 2007 వద్ద 3:30 అపరాహ్నం
మీ కంటే గొప్ప అనుభవం ఒకటి ఉన్నది, మాస్నేహితులు UK కి ఇండియా నుండి బయలు దేరారు, మెత్తం ముగ్గురు ఇద్దరు స్నేషితులు ఉన్నారు. హైదరాబాదు నుండి లొండన్ కి టిక్కేట్ట్ కొనేసుకొన్నరు , విమానం కూడా ఎక్కేసారు. విమానం UK పొలిమేరలలొ కి వచ్చేసింది, మెదటి సారి బయటి దేశం వెళ్ళడమేమో లండన్ గురించి బాగా చెప్పుకొంటున్నారు లండన్ వీధులలొ సరి సంఖ్యలొని ఇళ్ళు అని కుడి వైపు, బేసి సంఖ్య లోని ఇళ్ళు ఎడమ వైపు ఉంటాయి అని రకరకాలు గా కబుర్లు చెప్పుకొంటున్నారు, ఇంతఒ ఆ ముగ్గురి లొ ఒకడీకి సందేహం వచ్చింది లండన్ రాజధాని పేరు ఏమిటి?