Posted by: ssreddyr on: జులై 9, 2007
నేను ఇంటర్ చదివే రొజుల్లొ నాకు ఒక మిత్రుడు ఉండెవాడు. పేరు బసిరెడ్డి. దాదాపు 10 సంవత్సరాల క్రితం మేము విడిపొయము, అప్పట్లొ కాలేజీ చివరి రొజున అతనికి ఓ లేఖ వ్రాసాను అది మీ ముందు ఉంచుతున్నాను …..
జీవితం లో మరుపురాని మనిషి నేస్తం,
ఓ నేస్తం , మనం విడిపోకుడదు అను నిత్యం ..
ఇంతలొ ఈ హఠత్ పరిణామం
ఏ విడ్కోలు మన స్నేహం పై కన్నుకుట్టిన విధికి విలాసం.
మిత్రమా, ఈ రోజు మనం విపొబొతున్నాము
కాని విడిపొయెది మాత్రం మళ్ళీ కలుసుకోవడనికె,
మన ఈ రెండు సంవత్సరాల జీవనప్రయాణం ఎంతో మధురం ,
కాలెజీ ఎగ్గొటి సినిమ వెళ్ళిన రోజులు, క్రికెట్ ఆదిన రోజులు
ఎంత కాలమైన నా హౄదయం లో మౌనముద్రవోలె జీవం పోసి వుంచుతాను
మిత్రమా , మనం కలసి ఉన్నప్పుడు అనిపించలేదు విడిపొయెటప్పటి బాధ ఏమిటో ,
మనం విడిపొతున్నందుకు నాలొని బాధను , భావాలను ఎలా చెప్పలో తెలియడం లేదు …..
నేస్తం, ఒకటి మాత్రం గుర్తించు ఇది కవిత కాదు
అశ్రుపురిత హౄదయంతో ,వేదనా భరిత మనస్సు తో
చెబుతున్న,కాదు నేస్తం కాదు …..
చెప్పలేక వ్రాస్తున్న మాటలు ఇవి ..
మనం మరలా కలసి ప్రయాణించే జీవనకాలం ఎప్పుడు నేస్తం …
ఆ రోజు కోసం ఎదురు చూస్తూ ఉంటాను
ఇట్లు నీ నేస్తం శివం……
జులై 10, 2007 వద్ద 2:57 పూర్వాహ్నం
వీడ్కోలు అన్నది ఎంత బాధాకరమో ప్రతీ విధ్యార్ధికీ అనుభవమవుతుంది.కవిత బాగుంది.