తొలిసారి….

నా మిత్రుని కోసం

Posted by: ssreddyr on: ఆగష్టు 4, 2007

ఆరోజు రెండు సంవత్సరాలుగా విడిపొయిన నా మిత్రున్ని కలుసుకోబోతున్నాను.
ఆరోజు అంతా నా మది నిండ పాత జ్ఞాపకాల నీడలె,
మేము విడిపోయె రోజు ఎంతగా క్షోభ  అనుభవించామో నాకు బాగ గుర్తు,
ఎంతో ఆనందముగా సంవత్సరాలనే నిముషాలుగ గడిపిన ఆ రోజులు నాకు బాగ గుర్తు,
విడిపోయెరోజు “మిత్రమా ,మనం విడిపోయెది మాత్రం మళ్ళీ  కలుసుకోవడనికే” అని నా మిత్రునితో అన్న మాటలు నాకు బాగ గుర్తు.
ఇంతలొ నా మిత్రున్ని కలుసుకున్నాను,
ఆ సమయం లొ ఎన్నొ విషాయలు మాట్లాడలనిఉన్న ఆ ఆనందం లొ ఒక్క మాట మాట్లాడలెక పోయాను , నా మిత్రునిలోను అదే పరిస్థితి.
ఇంక మేము విడిపొమని తెలిసి ఎంతో ఆనందిచాము…..
ఇంతలొ పక్షుల కిలకిలరావలతొ తెల్లవారింది …..
నా కల చెదిరింది , నాలో నిరాశ మిగిలింది
ఇదంతా కలె అయినా నా మిత్రున్ని కలుసుకున్నందుకు ఆనందము గానే వుంది .
కాని ఈ కల నిజమవుతుందన్న ఆశ మాత్రం నాలో దృఢంగా  వుంది .
నా మిత్ర్రున్ని  కలుసుకొనేవరకు ఇలా ఎన్నిరోజులో ఎన్ని కలలొ …..              
    

ప్రత్యుత్తరమిమ్ము