Posted by: ssreddyr on: జులై 22, 2008
ఈ వారం ఈనాడులొ వచ్చిన ఈ కథ చదివారా?
http://eenadu.net/htm/weekpanel2.asp
నాకు ఇలాంటి అనుభవం ఒకటి ఎదురైంది…
ఓ రోజు ఆఫిస్ నుండి వస్తున్న నాకు ఒక వ్యక్తి ఆపి తనది ఉత్తర భారత దెశం అని ..తన డబ్బు పొయింది అని చెప్పాడు ..అతనితొ పాటు ఇద్దరు ఆడవాళ్లు ఒక 3 సంవత్సరాల బిడ్డ ఉన్నాడు ..ఆకలిగా ఉంది సహాయం చెయమన్నాడు …
నాకు చిన్న పిల్లడి ని చూసి జాలెసి … జెబులొ ఉన్న 100 రూపాయలు తిసి ఇచ్చి .. తౄప్తిగా ఇంటికి నడిచాను ….
సుమారుగా 10 నెలల క్రిందట ఇది జరిగింది ..వాళ్లని ..నెను ఇప్పటికి చుస్తునె ఉన్నాను … ఇప్పటి కి అదె కథ చెబుతు డబ్బు అడుగుతు వున్నారు …
ఇప్పుడు చెప్పండి ఎవరిని నమ్మలొ ఎవరిని నమ్మకూడదొ …ఎలాతెలుస్తుంది ?
రెడ్డిగారూ
“ఎవరిని నమ్మాలి?” అన్న మీ ప్రశ్నకు జవాబు చెప్పటం కష్టం. కాని మీరిచ్చిన లింకులోని కధ చదివేను. చాలా బాగుంది. ఆకధలో మీ ప్రశ్నకు జవాబు లేదా?
ఆనలుగురూ సినిమాలో అనుకు0టాను రాజే0ద్రప్రసాదు వాళ్ళ పిల్లలు అడిగిన ఇలా0టి ప్రశ్నకే జవాబుగా చెపుతాడు….100 రూపాయలన్నది మనకి పెద్ద మొత్త0 కాదు.అది ఇవ్వడ0 వల్ల మనకి వఛ్ఛే నష్ట0 పెద్దగా ఏమీ వు0డదు.కానీ ఆ తీసుకున్నవారు నిజ0గా అవసర0లో వున్నవాళ్ళయితే మనమిఛ్ఛిన ఆ వ0ద చాలా మ0చి చేస్తు0ది.అదే వాళ్ళు మోసగాళ్ళయితే మనకి పోయేది వ0ద మాత్రమే అని.
జులై 22, 2008 వద్ద 5:26 అపరాహ్నం
ఈ సారి కనపడితే నాలుగు పీకండి. ఆ పీకుడు ఎలా ఉండాలంటే… ఇక జన్మలో మర్చిపోకుండా…ఉండాలి.