తొలిసారి….

Archive for జూలై 2007

నువ్వంటే నాకు ఇష్టం,
నువ్వంటె ప్రతి ఒక్కరికి ఇష్టం…
నిన్ను కాదు అనేది ఎవరు ..
నిన్ను కాదు అన్నడంటే ఏమి తెలియని బాలుడో ,పిచ్చివాడో,  
లేక సర్వసంగ పరిత్యాగో అయ్యుంటాడు ..
నీవు ఎవరు ?. నిజం చెప్పు ..
నీవు “డబ్బు” కదూ ?

ప్రకటనలు

నేను ఇంటర్ చదివే రొజుల్లొ నాకు ఒక మిత్రుడు ఉండెవాడు. పేరు బసిరెడ్డి. దాదాపు 10 సంవత్సరాల క్రితం మేము విడిపొయము, అప్పట్లొ కాలేజీ చివరి రొజున అతనికి ఓ లేఖ వ్రాసాను అది మీ ముందు ఉంచుతున్నాను …..

జీవితం లో మరుపురాని మనిషి నేస్తం,
ఓ నేస్తం , మనం విడిపోకుడదు అను నిత్యం ..
ఇంతలొ ఈ హఠత్ పరిణామం
ఏ విడ్కోలు మన స్నేహం పై కన్నుకుట్టిన విధికి విలాసం.
మిత్రమా, ఈ రోజు మనం విపొబొతున్నాము
కాని విడిపొయెది మాత్రం మళ్ళీ కలుసుకోవడనికె,
మన ఈ రెండు సంవత్సరాల జీవనప్రయాణం ఎంతో మధురం ,
కాలెజీ ఎగ్గొటి సినిమ వెళ్ళిన రోజులు, క్రికెట్ ఆదిన రోజులు
ఎంత కాలమైన నా హౄదయం లో మౌనముద్రవోలె జీవం పోసి వుంచుతాను
మిత్రమా , మనం కలసి ఉన్నప్పుడు అనిపించలేదు విడిపొయెటప్పటి బాధ ఏమిటో ,
మనం విడిపొతున్నందుకు నాలొని బాధను , భావాలను ఎలా చెప్పలో తెలియడం లేదు …..
నేస్తం, ఒకటి మాత్రం గుర్తించు ఇది కవిత కాదు
అశ్రుపురిత హౄదయంతో ,వేదనా భరిత మనస్సు తో
చెబుతున్న,కాదు నేస్తం కాదు …..
చెప్పలేక వ్రాస్తున్న మాటలు ఇవి ..
మనం మరలా కలసి ప్రయాణించే జీవనకాలం ఎప్పుడు నేస్తం …
ఆ రోజు  కోసం   ఎదురు చూస్తూ ఉంటాను
ఇట్లు నీ నేస్తం శివం……            

ఇక ప్రాజెక్ట్ కొసం వేట మెదలు అయ్యింది….

కొన్ని కంపనీ లు ప్రాజెక్ట్ ఇస్తాము అన్నారు డబ్బు కడితె … నా దగ్గర అంత డబ్బు లెదాయె …
డబ్బు అడక్కుండ ప్రాజెక్ట్ ఇచ్చే కంపనీ దొరక్కపొతుందా అని పట్టు వదలని విక్రమార్కుని ల ప్రయత్నిస్తూనే ఉన్నాను
 
అలా రోజు మాదిరిగ ఓ రోజు ఒక చిన్న కంపని కి వెళ్లి ( పేరు గుర్తు లేదు) వచ్చి రాని ఇంగ్లిష్ లొ (నాకు ఇంగ్లిష్ అంటె చచ్చెంత  భయం )  రెషెప్సనిస్ట్ ని ప్రాజెక్ట్ అడిగను. ఆమె నన్ను ఆ కంపనీ మేనేజర్ దగ్గరకు పంపింది . మనసులొ నాకు ప్రాజెక్ట్ దొరికిపొయినంత ఆనందం కలిగింది . ఎందుకంటె అన్ని కంపనిలు రెసుమి తీసుకొని తరువాత కాల్ చెస్తాము  అని చెప్పెవారు , ఇక్కడేమొ డైరెక్ట్ గా మేనేజర్ దగ్గరకు పొమ్మనుటున్నరు చూస్తె చాల రెక్వరెమెంట్ ఉన్నట్టుంది.

మేనేజర్ దగ్గరకు వెళ్ళను, ఆయనకు నాకు మధ్య సంభాశన ఇలా జరిగింది ..

మేనేజర్ : what is your name?

నేను     :shankar reddy sir i am studing mca final semistar ..looking for project.. ( ఈ నాలుగు ముక్కలు ఇంగ్లిష్ లొ బట్టీ పట్టి వెళ్ళను )
మేనేజర్ : Well mr.reDDy here we have just started our branch. we do development in our main branch,it is not here ..here we dont have any projects also .  
నేను     : No problem sir, give main branch address, i go there  అన్న వచ్హి రని ఇంగ్లిషులొ
మేనేజర్ : Great ..For project work if you want to go that far ..i will give the address అని ఒక పెపరు లొ వ్రాసి ఇచ్చారు.

అక్కడ నుండి గర్వంగా బయటకు వచ్చాను.

వెంటనె హైదరాబాదు లో డబ్బు కట్టి ప్రాజెక్ట్ వర్క్ చేస్తున్న సత్యం గానికి, రుపెష్ గానికి నాకు ప్రాజెక్ట్ అల్మొస్ట్ వచ్చినట్లె  అని ఫొన్ చేసి చెప్పా గర్వంగా . అలాగే ఏ ప్రాజెక్ట్  లేని  శెషు గానికి తులసి గానికి ఫొన్ చేసి వాళ్ళ కు కూడ ప్రాజెక్ట్ నేను ఇప్పిస్తానని హామి ఇచ్చాను.  ఇంక తులసి గాడు  ఐతే రాత్రికే బస్ ఎక్కెస్తానన్నాడు . ఆ రొజుకు వాన్ని రాకుండ ఆపెసరికి నా తల ప్రణాం తొకకు వచ్చింది

ఆప్పుడె కొత్త అడ్రస్ తీసుకొని ఆ కంపని దగ్గరకు వెళ్ళాలని అడ్రస్ ఇద్దరు ముగ్గురు దారిన పొయె వాళ్ళని అడిగాను , తెలిదు  అని కొందరు , మరి కొందరు నా వైపు కొపంగ చూస్తు వెళ్ళారు , నాకైతె ఏమి అర్థం కాలె ….

రూంలొ ఫ్రెండ్స్ ని అడిగి తరువాతి రొజు పొదాం లే అనుకుని …  రూంకి స్వీట్స్ తీసుకొని వెళ్ళాను

రూంలొ అందరికి అల్మొస్ట్ ప్రాజెక్ట్ వచ్చినట్లె అని  చెప్పి స్వీట్స్ ఇచ్చాను, వాల్లంత ప్రాజెక్ట్ ఎక్కడ అని అడిగారు , ఇక్కడే బెంగళరు లొ కాని అడ్రస్ నాకు తెలిదు,  ఎవరిని అడిగిన విచిత్రంగా చుస్తున్నారు  మిరైన  ఎక్కడొ చెప్పండంటు వాళ్ళకు అడ్రస్ చుపించాను . వాళ్ళు ఆ అడ్రస్ చూసి ఒకటే నవ్వు …నాకైతె ఏమి అర్థం కాలేదు

  తరువాత వాళ్ళు నవ్వు ఆపి చెప్పెంత వరకు తెలిదు  అడ్రస్  లొ వున్నది “నొయ్ డ” అని అది బెంగళరు లొ లేదని , డిల్లి దగ్గర వుందని ..(నిజంగ నేను “నొయ్ డ” పేరు ని అంత వరకు విని ఎరుగను ) అప్పుడు చూడలి కొద్ది రొజులపటు నా అవస్థ ఓ వైపు  శెషు,తులసి దగ్గిర నుండి   ఫొన్ ల మిద ఫొన్ లు రూంలొ వాళ్ళు నన్ను ఆటపట్టించటము …..

(ఇప్పటికి నా ఫ్రెండ్స్ ఏ విషయము గుర్తు చెస్తూ నన్ను ఆటపట్టిస్తుంటారు …..) 
    

అందరికి నమస్కారం, నా అనుభవాలను కొన్నిటిని మీ ముందు ఉంచాలని నా ప్రయత్నము . ఇది నా తొలి ప్రయత్నము … తప్పులు వుంటె తెలియచెయగలరు … అని ఆశిస్తు …. *******************************************************************

ఇది నాలుగు సంవత్సరాల క్రిందటి మాట…..

నేను యం.సి.ఎ కోర్సు పూర్తి చేసి ఉద్యొగం కోసం నేను బెంగుళురు వచ్చాను. నా మిత్రులు అంతా హైదరాబాదు కు వెళ్ళారు.నాకు వరసకు మామయ్యా అయ్యే ఆయన ఇక్కడ బెంగుళురు లొ ఉండటము తొ నెను బెంగుళురు వచ్చాను.

మ మామయ్యా ఫ్రెండ్స్ కూడా సాఫ్ట్ వేర్ జాబ్స్ కు ట్రై చెస్తువుండటం  తో వాళ్ళ ఫ్రెండ్స్ రూములొ నన్ను వదిళారు.

మ మామయ్యా ఫ్రెండ్స్ , మ మామయ్యా  మాట కాదు అనలేక, ఇష్టము లేకపొయినా నన్ను అక్కడ వుండమన్నారు.రూము మాత్రం చాల చిన్నది రాత్రి ఒక వైపు కు పడుకొంటె రెండవైపు కు తిరిగె అవకాశము లెదు. మా మామయ్యా ఫ్రెండ్స్ ఎవరు నాకు తెలెయదు ఆయె. వాళ్ళ కు నేను కొత్త, భోజనం కోసము మాత్రం నన్ను పిలెచే వారు అలా రెండు రోజులు జైలు లొ  లాగ గడచిపొయింది…

మూడవ రోజు  ఇంక లాభాం  లేదు నేను ఎలాగొల వాళ్ళ తొ కలసిపొవలని అనుకున్న. కాని ఎలా… అని ఆలొచిస్తున్న నాకు ఒక ఐడియ  వచ్చింది. నాకు తెలిసిన కుల్లు జొకులను చె ప్పి వారితొ మెల్లిగ పరిచయము పెంచుకోవలని అనుకున్నాను …

ఒక  అతను ఒంటరిగా ఉండెది చూసి ..వెళ్ళి అన్న నిన్ను  ఒక ప్రశ్న అడగన అన్నాను , ఆయన నా వైపు ఎగ దిగ ఒక చుపు చూసి ..అఇష్టంగానే సరె చెప్పు అన్నాడు. ఇక నేను మొదలెట్టా
  
        ఒక ఏనుగు , చీమ రెండు బైక్ లో వెళుతున్నవి చీమ బైక్ ను నడుపుతూ వుంది, ఇంతలొ బైక్ వెళ్ళి ఒక కొండకు ఢీ కొట్టింది. ఏనుగు తలకు బాగ దెబ్బలు తగిలాయి …కాని ముందు కూర్చొన్న చీమ తలకు ఏటువంటి గాయము తగలలెదు ఎందుకు ? అని అడిగాను

   అతను కొద్దిసేపు ఆలోచించి చీమ బరువు తక్కువా … కాబట్టి ద్రవ్యరాసి తక్కువ , ద్రవ్యరాసి తక్కువగా వున్న వస్తువు దేనికైన ఢీ కొంటే తక్కువ బలము ప్రయొగించబడును (ఇంకా ఎదొదో చెప్పడు నాకు గుర్తు లేదు) అని చెప్పి ఇది కరెక్టా అని అడిగాడు తన భౌతిక శాస్రా పరిజ్ఙానికి మురిసిపోతు…… నేను కాదు చీమ హెల్మెట్ పెట్టుకునందు వల్ల చీమ తలకు దెబ్బ తగలలెదు అని చెప్పాను …
 
     నాదెగ్గర జొకులు వద్దు ? అని …నా వైపు కొపంగా చూసి వెల్లిపొయడు…
    
     కాని అప్పుడు అలా వెళ్ళినా  ఆరోజు రాత్రి జరిగిన విషము అందరికి చెప్పి నవ్వుకున్నాడు అప్పటి నుండి రూములొ అందరూ అతన్ని ప్రొఫెసర్ అని అట పట్టించటము జరెగేది ….

     ఆ తరువాతా రూములొ అందరు నాకు మంచి ఫ్రెండ్స్ అయ్యారు.

     ఇలా బెంగుళూలొ నా ప్రస్తానము మొదలు అయ్యింది …
 

నేను ఇంటర్ మొదటి సవంత్సరము చదువుతున్నప్పుడు వ్రాసినది.

అది పదహారెళ్లప్రాయం, ఊహల్లొ పయనించే ప్రాయం
ఈ ప్రాయం లో అనిపిస్తుంది చదువు అంటే బోరు,
ఈ ప్రాయం లో కనిపించేది మాత్రం సినిమా ల జోరు,
ఎప్పుడు ఆనందముగ ఉండాలనే మనోభావాలు,
తమను మించిన వారు ఉండరాదని కోరుకొనె చిరుహృదయాలు,
చెదు మార్గాలకు సులభంగా లొంగే విద్యార్థులు,
మంచి మార్గం లొ పయనించాలనే తపన తో నిరాశ చెందే లెతమనసులు,
అపజయం నుండి తేరుకొలేక నిరశతో బ్రతికే హృదయాలు,
సుఖ దుఃఖా లను సమపళ్లలొ చుడలేని మనసులు,
మిడి మిడి జ్ఞానంతో మిడిసిపడి జీవితంలో అదుగు పెట్టే విద్యార్థులు
ఏం చెస్తాం,
చదువును అలక్షం  చెసే ప్రాయం,
అది పదహారెళ్లప్రాయం, ఊహల్లొ పయనించే ప్రాయం …..!


ప్రకటనలు