తొలిసారి….

మాకొద్దు ఈ నవయుగం మాకొద్దు

Posted on: ఆగస్ట్ 26, 2007

మాకొద్దు , ఈ నవయుగం మాకొద్దు
ఈ నవయుగం లో బ్రతుకుబాట సాగించలేవు మా ప్రాణాలు,
బాంబుల విస్పొటనాలు , భయం గుప్పిట్లో ప్రజల ప్రాణాలు,
మరఫిరంగుల వాతబడిన ప్రజల ప్రాణాలు,
నిరంతరం కాలూష్యాలతొ సతమతమయ్యే సామాన్య మానవులు ,
అందుకే మాకొద్దు ఈ నవయుగం మాకొద్దు,
వాయుకాలూష్యం తో గాలి కూడ పీల్చలేని  పరిస్థితి మాది,
దినదినం గండాలతొ గడిచిపోయె బ్రతుకు మాది ,
భుభాగంలో మూడు వంతుల నీరుండి మంచి నీరు త్రాగలేని బ్రతుకు మాది,
వృక్షసంపద నశించి వర్షాలు లేక పంటలు పండని రాజ్యం మాది,
అనేక రోగాలతొ బ్రతుకు బారం మోయలేక రోజూ చస్తు బ్రతికే బ్రతుకు మాది
అందుకే ……….
మాకొద్దు ఈ నవయుగం మాకొద్దు.

5 వ్యాఖ్యలు to "మాకొద్దు ఈ నవయుగం మాకొద్దు"

మీ ఆవేశం అర్ధం అయ్యింది. మాకొద్దు అనటం బాగానే ఉంది. నవయుగం మాకొద్దు అనటమే బాగాలేదు. ఇవన్నీ లేని నవయుగమే కావాలి..పాత యుగం ఎవరికి కావాలి? సమాధిలో ఘోరీలకు తప్ప.

మీకు ఈ నవయుగం నుండి బయటకు తీసుకెళ్ళే మంత్రకావటం ఏఁవైనా కనబడితే నాకు తప్పకుండా తెలియజేయండి. నేను కూడా బెంగుళూరులోనే వుంటాను.

ఆవేశమైతే ఉందిగానీ…ఎక్కడి పారిపోదామో కాస్త ఆలోచించి చెప్పండి. నేనూ తయారే. బ్యాగ్ సర్దుకోనా?

వ్యాఖ్యానించండి