తొలిసారి….

Archive for జూన్ 2008

రోజు  శనివారం …
సమయం  ప్రొద్దున 8:00
ట్రింగ్ …ట్రింగ్ …ట్రింగ్ …
ఏ రోజు 11 గంటలకు గాని నిద్దుర లేవని హరిష్ గాడి నుండి పొద్దునె  8:00 గంటలకె ఫొను ..
నేను  : హలొ …
హరిష్ : మచా ఎన్నాడ పన్నరె …
నేను  : ఐ యాం స్లీపింగ్ మచా ..
హరిష్ : గెట్ అప్ అండ్ గెట్ రెడి ఫాస్ట్…
(పెళ్లి సంబందాల కొసం ఫొటొలు తియుంచు వెళ్లాలనుకు నా విషయం  అప్పుడు గాని గుర్తుకు రాలెదు నాకు)..
హరిష్ : మాచా వేగమా వాడ ఫస్ట్ షాపింగ్ పొలాము ఆపరొ పొటొ కు  పొలాము. (వాడి కి ఇప్పుడిప్పుడె పెళ్లి సంబందాలు మెదలు పెట్టారు, ఇంట్లొ వాళ్ల బాధలు భరించలెక . పొటొలు తియించుకుందాం అనుకున్నాము )
******************************
తిరిగ్గా 10:30 గంటలకు నేను ఫొరం వెళ్లాను.. అప్పటికే హరిష్ గాడు నాకొసం ఫొరం దగ్గర వున్నాడు ..
ఇద్దరం కలసి కొత్త బట్టలు  కొనె సరికి మద్యాహ్నం 1:00 అయింది …
ఇంక బొజనం చేసి పొటొ  కు పొదాం అన్నాను …ఒక్కసారిగా కెవ్వు మన్న కేక వినపడింది ..ఎవరబ్బ అని చూస్తె అలా అరిచింది వాడె…ఎమైంది అని అడిగా వాడు కోపంగా నికెమైన మతి పొయిందా ఫస్ట్ పొటొ కు పొదాం ఆ తరువాతే బొజనం  అన్నాడు…ఎందుకు అలా ముందు బొజనం అని నేను పట్టు పట్టాను …అప్పుడు చెప్పడు వాడు … బొజనం చేస్తె పొట్ట ఎత్తుగా కనిపిస్తుందని …(నాది అదే సమస్య కాని వాని అంత పెద్ద పొట్ట కాదు నాది) .. నువ్వు చెప్పింది నిజమె మచా అని చెప్పి ఎయిర్ పొర్ట్ రొడ్డు లొ వున్న మా ఇంటికి వెళ్లి నీటుగా మెఖం కడుక్కొని బయలుదెరాము .. అప్పుడె కొత్తగ కొన్న బట్టలకు ఇస్త్రి చెసి మరి ఒక ప్రముఖ పొటొ స్టూడియొ కు వెళ్లాము ..
*************************************
రెషప్షనిస్టి : ఎమి కావలి సార్
నేను  :  పొటొ లు తిసుకొవాలండి
రెషప్షనిస్టి : ఎందుకు ?
నేను  : (సిగ్గుపడుతు ) మారెజ్ ప్రపొసల్స్ కు
రెషప్షనిస్టి :  మాదగ్గర ఒక పాకెజ్ వుంది సార్ 700 రూపాయలు 6 స్టిల్స్ తీస్తాము …
నేను  : అలాగె మా ఇద్దరికి పొటొ కావలి ….
రెషప్షనిస్టి : అలాగె …మీకు ఇద్దరికి ఇండివిజువల్ గా కావలన  లేక టుగెదర్ గా కావలన   ?
కెవ్వుమన్న రెండు కేకలు … ఏ సారి హరిష్ గాడి తొ పాటు నేను కూడా అరిచాను
ఇద్దరికి ఇండివిజువల్ కావలని చెప్పి పొటొ తియుంచుకొని ఇంటికి వెళ్లాము
***********************************
రోజు  సొమవారం
సమయం మద్యాహ్నం 2:00
రెషప్షనిస్టి  ఇచ్చిన షాక్ నుండి అప్పుడప్పుదె కొంచం తెరుకొని వెళ్లి నా పొటొలు తెచ్చను.పొటొలు బాగానే వున్నయి అనుకుంటు పక్క సీటు లొ వున్న కిషొర్  కు చూపించాను  వాడు పొటొలు చాల బాగున్నాయి రా ఎవరివి అన్నాడు….
అప్పుడు నా మనసు మిక్సి లొ వెసిన మినపప్పు  లా బాధగా  మూలిగింది…
వాడు అన్న మాటలతొ ఇంక ఆ పొటొ లు నాకు నచ్చలే వాటిని పక్కన పడేసి మరో శనివారం కోసం ఎదురు చుస్తున్నాను …..

ప్రకటనలు

ప్రకటనలు