తొలిసారి….

అల్లరి….అల్లరి

Posted on: జూలై 29, 2008

చిన్నప్పటి సంగతి …..

       ఒక పెపర్లొ రాళ్లు  లెదా ఇసుక పొట్లం కట్టి దారి మధ్యలో పెట్టి పిల్లలందరము దగ్గరలొ ఏ చెట్టు చాటునో దాక్కునె వాళ్లం …
       ( తడిమి చూస్తే చిన్న రాళ్లు పప్పులలాగా , ఇసుక రవ్వ లాగా వుండేది )    
       దారిన పోయెవాళ్లు  ఆ పొట్లం తీసుకొని విప్పి చూసె వారు ..వారు అలా పొట్లం విప్పగానె చెట్టు చాటున దాక్కున్నవాళ్లం అందరం బయటకు వచ్చి వాళ్లను చూసి నవ్వె వాళ్లం …

       కొందరైతె పొట్లం తీసుకొని ఎవరూ చూడకుండా దాచిపెట్టూకొని వెగంగా అక్కడినుండి వెల్లి పొయెవారు ….
*********************************************************************
తరువాత నెను ఇంటర్ చదివె రొజుల్లొ కాలెజ్ హస్టల్ లొ వుండె వాన్ని..

       కాలెజి కి హాస్టల్ 5 కిలొ మిటర్ల దూర౦ వు౦డెది …మాకు 2 కాలెజి బస్సులు వు౦డెవి …అ౦దులొ చిన్న బస్సు లొ పాటలు పెట్టెవారు ….కాని మా హాస్టల్ ఇన్ చార్జ్ బస్సు లొ పాటలు పెట్టడానికి ఒప్పుకొనె వాడు కాదు …అ౦దరిని …గూబె (అర్థ౦ తెలీదు) అని తిడుతూ వు౦డె వాడు …నేను ఈ స౦దర్భ్హ౦ లొ ఒక కవిత వ్రాసాను ….

చోట బస్సు లో వినాలి పాట..
అదే మాకు ర౦గుల తోట..
అదే మాకు పస౦దైన బాట..
కాని ఇ౦దుకు ఒకడు అడ్డు పడుతున్నాడట..
వాడి పెరు గూబె అట…
త్వరలొ ఒలుస్తామట ..వాడి తాట…

ఆయన తాట ఒలవడ౦ ఎమో గాని …ఇది ఆయనకు దొరకడ౦ రాసి౦ది నేను అని తెలవడ౦ ..నా తాట ఒలవడ౦ జరిగి పొయాయి ( జస్ట్ మ౦దలి౦చి ప౦పాడు అ౦తె …నమ్మ౦డి…)
   (ఈ విషయాన్ని ఈ బ్లాగ్ కమెంటు లొ వ్రాశాను http://chaitanyakondapally.blogspot.com/2008/07/blog-post_6146.html)
 
అప్పటి నుండి మా హాస్టల్ ఇన్‌చార్జ్ మీద నాలో పగ రగులుకుంది ( ఎంతైన సీమ బిడ్డను కదా….)

     అదికాక రోజు ప్రొద్దున్నె స్టడీ అనిచెప్పి 4:00 గంటలకే నిద్ర లేపెవాడు .. అందరిలొకి నెను చిన్నగా ,సన్నగా ఉండెవాడిని (ఇప్పుడు కాదులెండి ). రోజు నా మంచం దగ్గరకు వచ్చి చెంప చెల్లు మని కొట్టెవాడు … రెండు రోజులు ఓర్పు వహించాను …మూడో రోజు  అతనికి చెప్పాను ..అయినా లాభం లేదు .. అంతె …నాలోని బాలక్రిష్ణ నిద్ర లేచాడు ఇన్‌చార్జ్ కు ముహుర్థం పెట్టాము … దీని పెరు “ఆపరెషన్ దుప్పటి”
      ఆ రోజు ఎప్పటి లాగె బొజనం చేసి వార్డెన్ తన రూములొకి వెళ్లాడు అంతే నేను కరెంటు ప్రధాన మీటను ఆర్పివెయడము …రూములొ అప్పటికె రెడి గా ఉన్న నాలాంటి బాదితులు వార్డెన్ కు దుప్పటి వెయడం ఒక్కసారిగా జరిగిపొయాయి …. ఇంక తరువాత ఎమి జరిగిందొ …ఊహించుకొండి ( నాకు జీవితం లొ అదె మెదటి సారి ఒక మనిషిని కొట్టడం) ….
     
      కాని ఇలాచేసినందుకు అప్పుడెదో విజయం సాదించామని ఆనందపడినా ఇప్పటికి ఆ విషయం గుర్తువస్తే నాకు చాలా బాధ కలుగుతుంది  ..

ప్రకటనలు

3 వ్యాఖ్యలు to "అల్లరి….అల్లరి"

చిన్నప్పటి అల్లర్లేవేరు. అవి గుర్తుకు వస్తే హాయిగా నవ్వుకొనేలా ఉండాలి. అనవసరంగా అలా కొట్టడం తప్పు అని ఇప్పటికీ మీరు ఫీల్ అవుతున్నారు చూసారూ అది బాగా నచ్చింది.

ఫీల్ అవుతున్నారు చూసారూ అది బాగా నచ్చింది.same feeling.nice one.

ప్రతాప్ గారు ,రాధిక గారు ..
నెనర్లు

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s

ప్రకటనలు
%d bloggers like this: