తొలిసారి….

Archive for సెప్టెంబర్ 2008

మొన్న మా ఊరికి పగటిపూట బస్ లొ బయలుదేరా..పగటి పూట ప్రయాణం అవటం వల్ల , నిద్ర రాక నా ఆలోచనలు అలా అలా మారుపేర్ల మీదకు మళ్లాయి….
      ఈ మారుపేర్లు వ్యక్తుల ప్రవర్తన …వారి వారి నడవడిక ను మొదలగు వాటిని బట్టి ఈ మారు పేర్లు వస్తాయి.. కొందరు ఈ మారు పేర్లు పెట్టడం లొ సిద్దహస్తులు …. ఈ మారు పేర్లు ఆయ వ్యక్తులను బాధ పెట్టకుండా వున్నంతవరకు బాగావుంటాయి..
*****************************************************************************
నాకు ఐదు సంవత్సరాల వయస్సులొ అనుకుంటా ..నన్ను” ముక్కు పోగు రెడ్డి” అని పిలిచెవారు ..అప్పట్లొ నా ముక్కుకు పోగు వుండెది.

తరువాత చాలారొజులవరకు ఈ మారుపేర్ల గొడవ వుండెది కాదు ..

*************************************************************************************************
డిగ్రి చదివే రొజుల్లొ నన్ను ” గుండుగా” అని పిలిచెవారు … ఆరు నెలలకు ఒకసారి తిరుపతి వెళ్లి గుండు చెయించుకొనెవాన్ని …
అప్పట్లొ నాకు ఇంకొక పేరు వుండెది ….”పాల్ ఆడమ్‌స్” ( సౌత్ ఆప్రికన్ బౌలర్) …మరి నల్లగా పొట్టిగా వుంటె నన్ను అలా పిచెవారు కాదు …నేను బంతి విసిరే తీరు (బౌలింగ్ యక్షన్)  పాల్ ఆడమ్‌స్ బౌలింగ్ యక్షన్ లా వుంటుంది   ఇప్పటికి కొందరు నన్ను అలనే పిలుస్తారు.  

       అప్పట్లొ నాకు నేను “రెశశిరా” ( రాజుల శివ శంకర రెడ్డి లొ ప్రతి పదం లో మొదటి అక్షరాలను తీసుకొని తిరగేసి అలా పెట్టుకున్నాను) అని ఒక కలం పేరు ను  ప్రకటించుకున్నాను ….ఎందుకంటె అప్పట్లొ తవికలు గట్రా  వ్రాస్తూవుండెవాడిని ..నాన్ను నేను గొప్పగా ఊహించుకొని అలా పెట్టుకున్నాను  … నా తవికలలాగె ఆ కలం పేరు కూడా పెద్దగా ప్రాచుర్యానికి నొచుకొలేదు ( మీరు నా తవికలు చదివాలనుకుంటె నా బ్లాగ్ లొ నే వున్నాయి ).

        ఇంకా, వంశీ గాన్ని “కఱ్ఱొడు” అని పిలిచెవాళ్లం . భరత్ గాన్ని “మఱ్ఱి చెట్టు” అని పిలిచెవాళ్లం ఎందుకంటె వాడు బాగా దిట్టంగా వుండి క్రికెట్ లొ ఫీల్డింగ్ చెసె టప్పుడు మఱ్ఱి చెట్టు లా కాలు అడ్డం పెడితె బంతి ఎటూ వెళ్లేది కాదు ..  , ఇంకా రాజగొపాల్ గాన్ని “గణపతి” అని పిలిచెవాళ్లం వాని చెవులు పెద్దగా వుండేవి …
       అప్పట్లో ఈ మారుపేర్ల బాధలు బాగా పడింది రాజెష్ గాడు … వాడిని “సిటికేబుల్” అని పిలిచె వాళ్లం .. ఈ పేరు ఎందుకు వచ్చిందంటె , అప్పట్లొ సిటికేబుల్ అనె లొకల్ చానెల్ అడ్వర్టైజమెంట్ లో చిన్ని కృష్ణుడు మన్ను తింటూ వుంటె యశోదమ్మ వెళ్లి కృష్ణుడి నోరు చుపించమంటుంది. కృష్ణుడు  నోరు తెరచి భుగొళాన్ని చుపిస్తాడు … ఆ భుగొళం నుంచి సిటికేబుల్ అని వస్తుంది మా రాజేష్ గాడి నోరు అంత పెద్దది అందుకే వాడి పేరు సిటికేబుల్ అని ….పిలిచేవాళ్లం..
*****************************************************************************
         యం.సి.ఎ చదివే రొజుల్లో తులసి గాడు ఈ పేర్లు పెట్టడం లో సిద్దహస్తుడు.శేషు కు “బుష్”  అని పేరు పెట్టాడు . తరువాత రమేష్ కు, శేషు కు ఎదో గొడవ జరిగింది ….అంతే రమేష్ కు “లాడెన్” అని పేరు పెట్టాడు …. మా క్లాసు లో ఇద్దరు భారి కాయులు వుండేవారు వాళ్లిద్దరు మంచి స్నేహితులు వాళ్లకు “పర్వతాలు , పానకాలు” అని పేరు పెట్టడం జరిగింది ..తరువాత తులసి గాడిని ,ప్రతాప్ ను, రూపేష్ ను, సత్యం ను మరియు నన్ను నన్ను కలిపి “తొట్టి గ్యాంగ్” అని “తొట్టి లీడర్” గ తులసి గాడిని పిలిచెవారు 
       ఈ మారుపేర్లకు అమ్మాయిలు అతీతులు కారు ….ఒక అమ్మయికి “ఒసేయ్ రాములమ్మ” అని ఎప్పుడు కలసి తిరిగే ఇద్దరు అమ్మయిలకు “సమ్మక్క,సారక్క” అని పేర్లు వుండెవి.
       అప్పట్లొ నన్ను “ఓ.డి.బి.సి” (ఓపెన్ డేటబేస్ కనెక్టివిటి)  అని పిలిచెవారు ….నాదగ్గర ఏ ఇంఫొర్మెసన్ కావాలన్న దొరికేది అని అలా పిలిచేవారు.                
************************************************************************
   ఊద్యొగం లో చేరిన తరువాత కూడా ఏ మారుపేర్ల గొడవ వుండేది … లావుగా వుండే హారిష్ గాడు బాగా క్రికెట్ ఆడేవాడు వాడికి “బూన్” (డెవిడ్ బూన్) అని మనికట్టు బౌలింగ్ వేసె సతిష్ కు “మురళిధరన్”  అని…మాప్రాజెక్ట్ మేనేజర్ ను” మన్మోహన్ సింగ్ “(పి.యం) అని పిలిచె వాళ్లం ……
******************************************************************************
     ఇప్పటికి ఐతె ఇంతె ,ఇంకా గుర్తుకు వచ్చినప్పుడు మళ్ళి వ్రాస్తాను …..
శలవు …

ప్రకటనలు

ప్రకటనలు